ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

- June 07, 2024 , by Maagulf
ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 21 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది.

తదుపరి విచారణను కోర్టు జూన్ 21కి వాయిదా వేసింది. సీబీఐ కేసులో కవితపై దాఖలైన చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకున్న రౌస్ రెవిన్యూ కోర్టు.. ఆమె కస్టడీని పొడిగించింది.

మరోవైపు.. కవిత చదువుకోవడానికి కొత్తగా తొమ్మిది పుస్తకాలు కావాలని కోర్టును కోరింది. ఇందుకు రౌస్ రెవిన్యూ కోర్టు అంగీకరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com