ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత..

- June 07, 2024 , by Maagulf
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు తీవ్ర అస్వస్థత..

హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు.

రామోజీరావుకు ప్రస్తుతం వెంటిలేటర్‌ పై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలోనూ ఆయన అనారోగ్యంతో బాధపడడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో ఆయన బాధపడ్డారు. దీంతో రామోజీరావు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు.

అనంతరం డిశ్చార్జి అయ్యారు. 87 ఏళ్ల వయస్సున్న ఆయన ఈనాడు గ్రూప్‌కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని. 60 పైగా సినిమాలను సైతం ఆయన నిర్మించారు. దశాబ్దాల తరబడి రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అన్ని భాషల సినిమాల షూటింగులు జరుగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com