ఆంధ్రా ప్రీమియర్ లీగ్ కొత్త లోగో
- June 10, 2024
స్థానిక క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నిర్వహిస్తున్న ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) మూడో సీజన్ రంగం సిద్ధమైంది. జూన్ 30 నుంచి జూలై 13 వరకు మూడో సీజన్ జరగనుంది. ఈ క్రమంలో సోమవారం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3 కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్లు కేఎస్ భరత్, నితీశ్‌కుమార్, రికీ భుయ్ లు పాల్గొని లోగోను ఆవిష్కరించారు.
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 ప్రొఫెషనల్ గా సాగనుందని నిర్వాహకులు చెప్పారు. ఈ ప్రీమియం లీగ్ కి మన ఆంధ్ర-మన ఏపీఎల్ అనే ట్యాగ్ లైన్ తో తీసుకొని వస్తున్నట్లు వెల్లడించారు. గల్లిలో టాలెంట్ ఉన్న వారికి మంచి అవకాశం ఇచ్చి, రాష్ట్ర స్థాయికి తీసుకొని వస్తున్నామని, ఇప్పుడు లీగ్ మ్యాచ్ లు నిర్వహించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున అదరగొట్టిన నితీశ్ రెడ్డి మాట్లాడుతూ.. తాను చాలా కింద స్థాయి నుంచి వచ్చినట్లు చెప్పాడు. ఆడటానికి మంచి అవకాశాలు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కల్పించిందన్నారు. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్స్ చాలా ఫేమస్ అయ్యాయని, చాలా మంది దీని గురించి అడిగినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!
- అమెరికాలో మొదటి యుద్ధ నౌకను ఆవిష్కరించిన సౌదీ..!!
- ఐపీఎల్ 2026..SRH పూర్తి జట్టు ఇదే..
- బ్రౌజింగ్ ప్రపంచంలో గూగుల్ క్రోమ్ అగ్రస్థానం







