సౌదీలో లేబర్ వర్కింగ్ అవర్స్ పై ఆంక్షలు

- June 11, 2024 , by Maagulf
సౌదీలో లేబర్ వర్కింగ్ అవర్స్ పై ఆంక్షలు

రియాద్: అన్ని ప్రైవేట్ రంగ సంస్థలకు మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు డైరెక్ట్ సన్ లైట్ లో పని చేయడంపై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు సౌదీ అరేబియాలోని అధికారులు వెల్లడించారు. జూన్ 15 నుండి సెప్టెంబర్ 15 వరకు నిషేధం అమలు చేయబడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ సహకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపారు. ప్రైవేట్ రంగ కార్మికుల భద్రత, ఆరోగ్యాన్ని నిర్ధారించడం, ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన పని వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే, మంత్రిత్వ శాఖ యొక్క ఏకీకృత నంబర్ (19911)ని సంప్రదించడం ద్వారా లేదా స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న మంత్రిత్వ శాఖ యాప్ ద్వారా నివేదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com