13న బాధ్యతలు స్వీకరించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- June 11, 2024
న్యూ ఢిల్లీ: తెలంగాణ బీజేపీ చీఫ్, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మోడీ 3.0 కేబినెట్లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మోడీ 2.0 మంత్రి మండలిలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డికి మోడీ 3.0 కేబినెట్ లో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిగా ఛాన్స్ దక్కింది.
కేంద్ర మంత్రిగా ప్రధాని మోడీతో పాటే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు కిషన్ రెడ్డి. మంత్రిగా ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు.
ఈ క్రమంలో కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిగా చార్జ్ తీసుకునేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 13న ఉదయం 11 గంటలకు కిషన్ రెడ్డి బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా, మోడీ 3.0 కేబినెట్లో తెలంగాణ నుండి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. కిషన్ రెడ్డికి కేబినెట్ హోదాతో మంత్రి దక్కగా.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు హోం శాఖ సహాయ మంత్రి పోస్ట్ లభించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







