ప్రభుత్వం పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

- June 11, 2024 , by Maagulf
ప్రభుత్వం పై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

తెలంగాణ: బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి బూడిద రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇసుక, ఎర్రమట్టి దందా యథేచ్ఛగా నడిపారని పేర్కొన్నారు.

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పని బూడిదలాగ అయినాక బూడిద రాజకీయం చేస్తుందని విమర్శించారు. రోజుకు 50 లక్షలు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేస్తున్న మీరు.. 10 ఏళ్లలో ఎంత సంపాదించారు? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీపీసీ పనులు ప్రారంభించిన నాటి నుండి బూడిదను రైతులకు ఉచితంగా ఇచ్చామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా దోపిడి చేసింది మీరు కాదా? అని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం పోరాడిండని కేసీఆర్ పొగిడిన సంగతి మరిచారా? అని బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతు భరోసాను బీఆర్ఎస్ గతంలో జూన్, జులైలో వేశారని తెలిపారు. మీ అవినీతి, అక్రమాల గురించి విచారణ జరుగుతుందని.. విచారణకు పాడి కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఆగస్టు 15లోపు చేసి తీరుతామని అన్నారు. హరీష్ మాట మార్చి రైతు రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అని రాజీనామా పై మాట్లాడుతుండని పేర్కొన్నారు. మీ దగ్గర ఎమ్మెల్యేలు 39 అని చెబుతున్నారు కాని.. సున్నా కాబోతోందని తెలుసుకోండని ఆది శ్రీనివాస్ తెలిపారు.

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీ అమలు చేయలేదని అన్నారు. ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు నిరాధారం.. బేస్ లెస్ ఆరోపణలు పొన్నం ప్రభాకర్ పై చేస్తున్నాడని మండిపడ్డారు. భార్య పిల్లల పేరుతో రాజకీయాలు చేసే నీచ స్థాయికి దిగజారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ తెరవెనుక ఉండి మాట్లాడిస్తున్నారని.. పొన్నం ప్రభాకర్ కు కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com