హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక చెక్-ఇన్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు
- June 12, 2024
యూఏఈ: వార్షిక ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం దుబాయ్ నుంచి వెళ్లే హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక ప్రైవేట్ కారిడార్ ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక చెక్-ఇన్ మరియు పాస్‌పోర్ట్ నియంత్రణ కోసం ప్రత్యేక కౌంటర్లు, ప్రత్యేక నిష్క్రమణ గేట్లను యాత్రికుల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దుబాయ్ ఎయిర్పోర్ట్స్లోని హజ్ కమిటీ అధిపతి మహ్మద్ అల్ మర్జౌకి మాట్లాడుతూ.. యాత్రికులు విమానాశ్రయ భవనంలోకి ప్రవేశించిన క్షణం నుండి, హజ్ యాత్రికులు వారి బయలుదేరే గేట్లను చేరుకునే వరకు ప్రైవేట్ కారిడార్ ఉంటుందన్నారు. "ప్రతి ఎయిర్‌లైన్‌కు ప్రత్యేక టెర్మినల్, నిర్ణీత ప్రాంతం ఉంటుంది. ఉదాహరణకు, కొంతమంది ప్రయాణికులు టెర్మినల్ 3, ఏరియా 3 నుండి ప్రయాణిస్తారు. అయితే సౌదీ ఎయిర్‌లైన్స్ టెర్మినల్ 1, ఏరియా 6 నుండి మరియు ఫ్లైనాస్ టెర్మినల్ 1, ఏరియా 4 నుండి బయలుదేరుతుంది." అని అధికారి వివరించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..