కొంత సేపు మూతపడిన దుబాయ్ విమానాశ్రయం
- June 11, 2016
అనుక్షణం ప్రయాణీకులతో హడావిడిగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్ట్ శనివారం మధ్యాహ్నం సుమారు గంటపాటు నిర్మానుష్యంగా మారింది. ఎయిర్ స్పేస్ లో ఓ అనధికార డ్రోన్ సంచారాన్ని గుర్తించడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు అప్రమత్తమయ్యారు. గంటపాటు ఎయిర్ పోర్టును మూసివేశారు. అప్పటికే ఎన్నో విమానాలు గాల్లో ప్రయాణిస్తుండగా వాటిని దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చినట్లు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ప్రతినిధులు వెల్లడించారు. శనివారం ఓ అనధికారిక డ్రోన్ తిరుగుతున్నట్లు గుర్తించిన దుబాయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు సుమారు గంటపాటు ఎయిర్ పోర్ట్ మూసివేశారు. ఉదయం 11.36 నిమిషాలనుంచి, మధ్యాహ్నం 12.45 వరకు దుబాయ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా ఎయిర్ ట్రాఫిక్ ను నిలిపివేశారు.
ఇటీవల రెండేళ్ళకాలంలో దుబాయ్ లో ఇలా జరగడం రెండోసారి అని దుబాయ్ ఎయిర్ పోర్ట్ ఓ ప్రకటనలో నివేదించింది. మొత్తం 69 నిమిషాలపాటు ఎయిర్ పోర్టు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కారణంగా అనేక విమానాలు ఆలస్యం కావడంతోపాటు.. కొన్నింటిని దారి మరల్చాల్సిన అవసరం ఏర్పడిందని వెల్లడించింది. అనధికార డ్రోన్ కారణంగా అనేక విమానాలను దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టుకు మరల్చాల్సి వచ్చిందని దుబాయ్ ఎయిర్ పోర్టు ప్రతినిధి ఒకరు తెలిపారు. తిరగి తమ కార్యకలాపాలు పునరుద్ధరించడానికి, వినియోగదారుల అసౌకర్యాన్ని తగ్గించడానికి తమ వాటాదారులతో కలసి పనిచేస్తున్నట్లు తెలిపారు. తమకు భద్రతే మొదటి ప్రాధాన్యత అని, రెగ్యులేటరీ అథారిటీ ప్రకారం విమానాశ్రయానికి, లేదా ల్యాండింగ్ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలోనూ, నిషేధిత పరిమిత ప్రాంతాల్లోనూ ప్రైవేటు కార్యకలాపాలకు, మానవ రహిత వాహనాలకు ఎట్టిపరిస్థితిలో అనుమతిలేదని ఎయిర్ పోర్ట్ ప్రకటనలో గుర్తుచేసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







