తలైవ లేకుండా 'కబాలి' ఆడియో విడుదల
- June 11, 2016
భారీ అంచనాల నడుమ అత్యంత అట్టహాసంగా విడుదల అవుతుందనుకున్న 'కబాలి' ఆడియో చాలా సాదా సీదాగా బయటకు వచ్చేసింది. శనివారం సాయంత్రం అత్యంత సాధారణంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ కుమార్తె సౌందర్యకు డిస్క్ ఇవ్వడం ద్వారా ఆడియోను విడుదల చేశారు. నిజానికి ఆదివారం ఈ సినిమా ఆడియోను విడుదల చేయాలని తొలుత అనుకున్నారు. కానీ, రజనీకాంత్ ఇంకా అమెరికాలోనే ఉండటంతో ఆడియో విడుదలను వాయిదా వేసినట్లు కథనాలు వచ్చాయి.ఈలోపే.. 30 సెకండ్ల నిడివి ఉన్న ఆడియో క్లిప్ ఒకటి లీకైంది. ఈ నేపథ్యంలో అధికారికంగానే పాటలను విడుదల చేస్తే మంచిదని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు.. హడావుడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముగించేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









