జీ-7: ముగిసిన ప్రధాని మోదీ పర్యటన..
- June 15, 2024
రోమ్: ఇటలీలోని అపులియాలో జరుగుతున్న జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు పాల్గొనటం చాలా అద్భుతం అనిపించిందని ప్రధాని మోదీ అన్నారు. ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్ తొలిరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరై..
పలువురు దేశాధినేతలతో భేటీ నిర్వహించారు.రోజంతా ఆయా దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇక.. జీ-7 దేశాల సమ్మిట్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఇండియాకు బయల్దేరారు. ఈ సందర్భంగా మోదీ 'ఎక్స్'లో ట్వీట్ చేశారు.
'ఇటలీలోని అపులియాలో జరిగిన G-7 సమ్మిట్‌లో చాలా ఉత్పాదకమైన రోజు. ప్రపంచ నాయకులతో భేటీ అయ్యాను. పలు దేశాధినేతలతో వివిధ అంశాలపై చర్చించాను. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించటం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని సృష్టించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం సాదరమైన ఆతిథ్యానికి ధన్యవాదాలు' అని మోదీ అన్నారు.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







