విజయవాడ-ముంబై విమాన సర్వీసు ప్రారంభించిన ఎంపీ బాలశౌరి
- June 15, 2024
విజయవాడ: మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చేతులమీదుగా విజయవాడ నుంచి ముంబై నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ తీసుకొచ్చిన నూతన విమాన సర్వీసు ప్రారంభమైంది.ఎంపీ బాలశౌరి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి,రిబ్బన్ కత్తిరించి నూతన సర్వీసుని ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్బంగా మొదటి బోర్డింగ్ పాస్ ని ప్రయాణికులకు ఎంపీ బాలశౌరి అందజేశారు.ముంబైకి మన రాజధాని అమరావతి నుంచి విమాన సర్వీస్ తీసుకురావాలని కేంద్ర పెద్దలతో పలుమార్లు చర్చలు జరపగా నేటికి అవి ఫలించాయని తెలిపారు.ముంబై నగరానికి సర్వీస్ రావడం వల్ల విదేశాలకు వెళ్లే వారికి కనెక్టింగ్ ఫ్లైట్ గా ఉపయోగపడుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.

తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







