లక్షల మంది వలసదారులకు అమెరికా పౌరసత్వం
- June 19, 2024
వాషింగ్టన్: ప్రస్తుత సంవత్సరంలో లక్షల మంది వలసదారులకు మేలు చేసే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్నారు. అమెరికా పౌరులను పెళ్లి చేసుకుని కూడా చట్టబద్ధ హోదా లేకుండా అమెరికాలో నివసించాల్సి వస్తున్న వారికి శాశ్వత నివాస హక్కు, అమెరికా పౌరసత్వం అందించాలని నిర్ణయించారు.
అమెరికా పౌరుడు లేదా పౌరురాలిని పెళ్లాడినవారికి పుట్టిన పిల్లల్లో 50,000 మందికి కూడా ఇదే వసతి లభిస్తుంది. అధ్యక్ష భవనం శ్వేతసౌధం మంగళవారం చేసిన ప్రకటనతో దాదాపు 5 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సిన పురుషులు లేదా మహిళలు అమెరికా పౌరులను పెళ్లాడిన తరవాత ఈ సోమవారం (జూన్ 17) నాటికి పదేళ్లుగా అమెరికాలో నివసించి ఉండాలి. సోమవారం దాటిన తరవాత పదేళ్లు నిండేవారికి ఈ సౌకర్యం లభించదు.
అర్హులైనవారి దరఖాస్తు ఆమోదం పొందిన మూడేళ్లలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి తాత్కాలిక పని పర్మిట్ లభిస్తుంది. ఈ మూడేళ్లలో వారిని స్వదేశాలకు తిప్పిపంపరు. అమెరికా పౌరులను పెళ్లాడినా ఆ దేశ పౌరసత్వం లభించనివారు 11 లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో అర్హులైనవారికి పౌరసత్వం లభించనుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







