నలంద యూనివర్సిటీ..పుస్తకాలు అగ్నికి కాలిపోవచ్చు..కానీ జ్ఞానం కాదు : మోదీ
- June 19, 2024
బిహార్ లోని రాజ్‌గిర్‌లో ఈరోజు(బుధవారం) ప్రధాని మోదీ నలంద యూనివర్సిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ రాజేంద్ర వి. అర్లేకర్, సీఎం నీతిష్ కుమార్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నలంద యూనివర్సిటీ.. భారత వారసత్వానికి, సంస్కృతికి చిహ్నమని అన్నారు. పురాతన శిథిలాల నుంచి ఇది పునరుజ్జీవించిందని ప్రశంసించారు. ఈ కొత్త విశ్వవిద్యాలయం దేశ సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. అగ్నికి పుస్తకాలు కాలిపోవచ్చు గాని.. జ్ఞానం కాదన్నారు.
ఇదిలా ఉండగా.. ఐదో శతాబ్దంలో ఏర్పాటుచేసిన పురాతన నలంద యూనివర్సిటీలో అప్పట్లో ఒకానొక టాప్ యూనివర్సిటీగా ఉండేది. ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. నలంద విశ్వవిద్యాలయం దాదాపు 800 ఏళ్ల పాటు సేవలందించిందని నిపుణులు తెలిపారు. 12వ శతాబ్ధంలో భారత్‌లోకి చొరబడ్డ అఘ్గన్లు ఈ యూనివర్సిటీని కూల్చివేశారు. అందులో ఉన్న పుస్తకాలను, మాన్యుస్క్రిప్ట్‌లను తగులబెట్టేశారు. అయితే 2016లో ఐక్యరాజ్యసమితి ఈ ప్రాంతాన్ని వారసత్వ సంపదగా ప్రకటించింది.
A memorable mix of history and education. Nalanda is truly special. Here are today’s highlights. pic.twitter.com/J17pxCwUD1
— Narendra Modi (@narendramodi) June 19, 2024
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







