శర్వాతో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌కి సై అంటోన్న ‘ఏజెంట్’ బ్యూటీ.!
- June 19, 2024
అన్నీ కలిసొస్తే.. ఈ పాటికి స్టార్ హీరోయిన్ అయిపోయేదేమో ఈ ముద్దుగుమ్మ. ఆ టాలెంట్ వుందీ పాపకి. అయితే, డెబ్యూ మూవీనే దెబ్బ కొట్టేసింది. అందాల భామ సాక్షి వైద్య గురించే మనం మాట్లాడుకుంటున్నాం.
అదేనండీ అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా వచ్చిన భారీ అంచనాల మూవీ ‘ఏజెంట్’లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించింది. అయితే, ఈ సినిమాలో పాప టాలెంట్ పెద్దగా చూసిందేమీ లేదు.
సినిమా ధియేటర్లలో డిజాస్టర్. ఇక, ఓటీటీలో కానీ, మరే ఇతర ఛానెల్లోనూ ‘ఏజెంట్’ సినిమా వచ్చింది లేదింతవరకూ.
అయితే, మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ సరసన ‘ఆపరేషన్ వాలైంటైన్’తో ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. ఈ సినిమాలో సీరియస్ టోన్.. హీరోకి సరిజోడీగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో తనదైన పర్ఫామెన్స్ ఇచ్చి మంచి మార్కులే వేయించుకుంది.
ఇక, ఇప్పుడు శర్వానంద్‌కి జోడీగా నటించబోతోంది. శర్వానంద్ హీరోగా రామ్ అబ్బవరపు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్‌కి జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది.
తాజాగా ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో సాక్షి వైద్య పాత్రను రివీల్ చేస్తూ పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్లో సాక్షి వైద్య పాత్ర పేరు ‘నిత్య’గా ప్రకటించారు. స్టైలిష్ లుక్స్‌లో అలా నడుచుకుంటూ వస్తున్న నిత్య పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







