అల్లు అర్జున్‌కి హ్యాండిచ్చిన దర్శకుడు.!
- June 19, 2024
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ లిస్టులో ప్రస్తుతం చాలానే ప్రాజెక్టులున్నాయ్.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది. అలాగే, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సివుంది.
అలాగే, ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడు తమిళంలో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు తెరకెక్కించి, ఈ మధ్యనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి హిట్ కొట్టిన అట్లీ కాంబినేషన్లోనూ అల్లు అర్జున్ సినిమా ఈ మధ్య ప్రచారంలో నిలిచింది.
అయితే, ఇప్పుడా ప్రాజెక్ట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. రెమ్యునరేషన్ విషయమై చిన్న కిరికిరి నడవడంతో అట్లీ ఈ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాడన్న వార్త తాజాగా ప్రచారంలోకి వచ్చింది.
అయితే, అల్లు అరవింద్ సొంత బ్యానర్లో రూపొందబోయే సినిమా ఇది. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ సమస్య ఎందుకుంటుంది.? అందులోనూ అట్లీ పక్కా సక్సెస్ డైరెక్టర్. సో, అది ఇష్యూనే కాదు, అలాంటిది ఈ దుష్ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందో తెలీదు కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్‌కి సంబంధించి ఒకింత దుష్ప్రచారం జరుగుతోంది.
అందుకు పలు రకాల కారణాలుండొచ్చు. కానీ, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







