అల్లు అర్జున్‌కి హ్యాండిచ్చిన దర్శకుడు.!

- June 19, 2024 , by Maagulf
అల్లు అర్జున్‌కి హ్యాండిచ్చిన దర్శకుడు.!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అయిన అల్లు అర్జున్ లిస్టులో ప్రస్తుతం చాలానే ప్రాజెక్టులున్నాయ్.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చర్చల దశలో వుంది. అలాగే, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయాల్సివుంది.

అలాగే, ఫెయిల్యూర్ ఎరగని దర్శకుడు తమిళంలో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు తెరకెక్కించి, ఈ మధ్యనే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్‌తో ‘జవాన్’ వంటి హిట్ కొట్టిన అట్లీ కాంబినేషన్‌లోనూ అల్లు అర్జున్  సినిమా ఈ మధ్య ప్రచారంలో నిలిచింది.

అయితే, ఇప్పుడా ప్రాజెక్ట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. రెమ్యునరేషన్ విషయమై చిన్న కిరికిరి నడవడంతో అట్లీ ఈ ప్రాజెక్ట్ వదిలేసుకున్నాడన్న వార్త తాజాగా ప్రచారంలోకి వచ్చింది.

అయితే, అల్లు అరవింద్ సొంత బ్యానర్‌లో రూపొందబోయే సినిమా ఇది. ఈ నేపథ్యంలో రెమ్యునరేషన్ సమస్య ఎందుకుంటుంది.? అందులోనూ అట్లీ పక్కా సక్సెస్ డైరెక్టర్. సో, అది ఇష్యూనే కాదు, అలాంటిది ఈ దుష్ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చిందో తెలీదు కానీ, ప్రస్తుతం అల్లు అర్జున్‌కి సంబంధించి ఒకింత దుష్ప్రచారం జరుగుతోంది.

అందుకు పలు రకాల కారణాలుండొచ్చు. కానీ, ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com