గెట్ రెడీ ఫర్ నితిన్ డబుల్ ధమాకా.!
- June 19, 2024
నితిన్‌కి చాలా కాలంగా సరైన హిట్టు పడలేదు. ‘భీష్మ’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన కాంబినేషన్ వెంకీ కుడుములతో నితిన్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
అదే ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని డిశంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.
అయితే, లేటెస్ట్ సమాచారం ప్రకారం, ఈ సినిమాని డిశంబర్ కన్నా ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అలాగే, నితిన్ తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ అయిన ‘తమ్ముడు’ టైటిల్‌తో చేస్తున్న సినిమా కూడా రిలీజ్ టైమ్ ఫిక్స్ చేసుకోనుంది. ఫిబ్రవరిలో ఈ సినిమాని రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
ఇంకా అఫీషియల్‌గా కన్‌ఫామ్ కాలేదు కానీ, త్వరలోనే ఈ డేట్ ప్రకటించనున్నారట. అందుకే ‘రాబిన్ హుడ్’ని వీలైనంత త్వరగా రిలీజ్ చేసే యోచనలో వున్నట్లు తెలుస్తోంది.
రెండు సినిమాల మధ్య గ్యాప్ కరెక్ట్‌గా వుండేందుకే ఈ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ సినిమాని దిల్ రాజు బ్యానర్‌లో శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నాడు. అంతా సవ్యంగా జరిగితే, నితిన్‌కి ఇది డబుల్ ధమాకానే.!
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







