దుబాయ్ లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 23, 2024
దుబాయ్: దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సీజీఐ అండ్ ఎఫ్ఓఐ ఈవెంట్స్ జూన్ 22న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం దుబాయ్‌లోని ఐకానిక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగింది. ఇందులో 1500 మంది పాఠశాల విద్యార్థులతో సహా ఐదు వేల మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. శారీరక మరియు మానసిక శ్రేయస్సును పెంపొందిస్తూ అనుభవజ్ఞులైన యోగా మాస్టర్లు వారితో యోగాసనాలు చేయించారు. సామరస్యం, అంతర్గత శాంతిని ప్రతిబింబించే ఈ పురాతన యోగా అభ్యాసాన్ని జరుపుకోవడానికి దాదాపు 50 దేశాలకు చెందిన యోగా ఔత్సాహికులు ఒకచోట చేరారు. ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేయడంలో పాల్గొన్న వారందరికీ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా కృతజ్ఞతలు తెలిపాయి.




తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







