సౌదీ అరేబియాలో త్రీ-టెర్మ్ స్కూల్ ఇయర్..8 వారాలపాటు వేసవి సెలవులు

- June 23, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో త్రీ-టెర్మ్ స్కూల్ ఇయర్..8 వారాలపాటు వేసవి సెలవులు

రియాద్: సౌదీ క్యాబినెట్ రాబోయే ఐదేళ్లపాటు ప్రభుత్వ విద్య, ఉన్నత విద్య, సాంకేతిక మరియు వృత్తిపరమైన శిక్షణలో అకడమిక్ క్యాలెండర్ కోసం సాధారణ కాలపరిమితిని ఆమోదించింది.
అదే సమయంలో, సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ రాబోయే విద్యా సంవత్సరానికి విద్యా క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రభుత్వ విద్యలో త్రీ-టెర్మ్ విద్యా సంవత్సరం వ్యవస్థ కొనసాగించనున్నారు.  అదే సమయంలో 180 బోధనా రోజుల కంటే తక్కువ కాకుండా కాలపరిమితిని నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో 8 వారాలపాటు వేసవి సెలవులు రానున్నాయి.  మొదటి టర్మ్  ఆగస్టు 18న ప్రారంభమవుతుంది. రెండవ టర్మ్  నవంబర్ 17 న ప్రారంభమవుతుంది. మూడవ టర్మ్ మార్చి 2, 2025న ప్రారంభమై, జూన్ 26, 2025న ముగుస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com