వ్యాపార దిగ్గజం..అదానీ
- June 24, 2024
ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ(Gautam Adani) తెలియని వారంటే అతిశయోక్తి కాదు. సోలార్, విద్యుత్తు తయారీ, రవాణా, సీపోర్ట్స్ నిర్వహణ, సిమెంట్ మరియు మీడియా వ్యాపార కార్యకలాపాల వెనుక తనదైన ముద్ర వేసిన వ్యక్తి అదానీ సంస్థల అధినేత గౌతమ్ గౌతమ్ అదానీ. నేడు గౌతమ్ గౌతమ్ అదానీ జన్మదినం.
గౌతమ్ శాంతిలాల్ అదానీ 1962 జూన్ 24న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. తండ్రి శాంతిలాల్, చిన్న వస్త్ర వ్యాపారి, తల్లి శాంతి అదానీ. వీరి కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురు, వీరిలో పెద్దవాడు మన్సుఖ్ భాయ్ అదానీ. ఈ కుటుంబం జీవనోపాధి కోసం ఉత్తర గుజరాత్ లోని తారాడ్ పట్టణం నుండి వలస వచ్చింది.
గౌతమ్ తన యుక్తవయసులో మహేంద్ర బ్రదర్స్ లో ఉండే వజ్రాలను అందించే ( డైమండ్ సార్టర్గా) తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత 1985 సంవత్సరంలో ప్రైమరీ పాలిమర్స్ ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాడు. తన వ్యాపార దక్షతతో అంచెలంచెలుగా రాణించారు.
1988లో కమొడిటీ ట్రేడింగ్‌తో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని క్రమక్రమంగా విస్తరించింది. ప్రస్తుతం దేశంలో బొగ్గు, మైనింగ్, లాజిస్టిక్స్, విద్యుదుత్పత్తి, విద్యుత్ పంపిణీ, గ్రీన్ ఎనర్జీ, ఎయిర్‌పోర్టులు, డేటా సెంటర్లు, సిమెంట్ తదితర రంగాల్లో అదానీ గ్రూప్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందుకు తగ్గట్లే అదానీ సంపద కూడా అంతకంతకూ పెరుగుతోంది.
భారతదేశంలో రెండవ రద్దీ విమానాశ్రయం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో 74% వాటాను కొనుగోలు చేశారు. 2022లో అంబుజా సిమెంట్స్ అనుబంధ విభాగమైన ఏసీసీని కొనుగోలు చేయడంతో పాటుగా, మీడియాలో విస్తరించే ఆలోచనతో ఇండియన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీని కొనుగోలు చేశాడు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ తాజా ఇండెక్స్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ 10,600 కోట్ల డాలర్లు (సుమారు రూ.8.85 లక్షల కోట్లు). అంతర్జాతీయంగా చూస్తే 14వ అతిపెద్ద సంపన్నుడు.
తన వ్యాపారవేత్త కావడానికి ఏర్పడ్డ పరిస్థితుల గురించి చెబుతూ చిన్నప్పటి నుంచి నాపై ఎవరైనా ఆధిపత్యం చెలాయిస్తే నచ్చేది కాదు. అజ్ఞాపించే ధోరణిలో మాట్లాడినా తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడే నాలాంటి వాడికి ఉద్యోగం సరిపోదని అర్థం చేసుకొని వ్యాపారం వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని అదానీ ఓ సందర్బంలో పేర్కొన్నారు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







