పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి
- June 24, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో కొలువుదీరిన 18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం మొదలయ్యాయి. కొత్తగా ఎన్నికైన 543 మంది పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన 42 మంది.. ఏపీ నుంచి 25 మంది, తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు వరుసగా ప్రమాణం చేస్తున్నారు. కొందరు అచ్చ తెలుగులో ప్రమాణం చేయగా... మరికొందరు ఇంగ్లీషులో ప్రమాణ స్వీకారం చేశారు.
పార్లమెంటులో రెండు రోజులపాటు ఎంపీల ప్రమాణం స్వీకారం జరుగనుండగా... తొలిరోజు పలువురు ప్రమాణం చేశారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా సోమవారం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేశారు. ‘‘వల్లభనేని బాలశౌరి అనే నేను...’’ అంటూ అచ్చ తెలుగులో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.
కాగా, బాలశౌరి మూడోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా మాచవరం మండలం, మొర్జంపాడు గ్రామంలో జన్మించిన ఆయన వ్యాపారవేత్త కాగా.. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన బాలశౌరి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుని.. వైఎస్ఆర్కు అత్యంత సన్నిహితుడుగా మారాడు. 2004లో తొలిసారి తెనాలి లోక్సభ స్థానానికి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి మచిలీపట్నం లోక్ సభ ఎన్నికల బరిలో దిగి.. రెండోసారి గెలిచారు. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున మచిలీపట్నంలోనే బరిలోకి దిగి ముచ్చటగా మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. వల్లభనేని బాలశౌరి మూడోసారి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా జనసేన నాయకులు, ఆయన అభిమానులు అభినందనలు తెలియజేశారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







