డయాబెటిక్ పేషెంట్లు గోంగూర తింటే ఏం జరుగుతుంది.?

- June 24, 2024 , by Maagulf
డయాబెటిక్ పేషెంట్లు గోంగూర తింటే ఏం జరుగుతుంది.?

డయాబెటిక్ అనేది దీర్ఘ కాలిక వ్యాధి. ఈ వ్యాధి ఒక్కసారి ఎటాక్ అయ్యిందంటే చాలు, దీన్నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్లా కాదు. కంట్రోల్‌లో వుంచుకోవడమే తప్ప, పూర్తిగా ఈ వ్యాధిని నియంత్రించుకోవడం అసాధ్యం.

అయితే, డయాబెటిక్ వున్నవాళ్లు తమ జీవన శైలిలో చాలా మార్పులు చేసుకోవల్సిన ఆవశ్యకత వుంది. అలాగే తీసుకునే ఆహారంలోనూ కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగ పాటించాలి.

స్వీట్లు తీనకూడదన్న అపోహ వుంది. కానీ, నిజమే డయాబెటిక్ వున్నవాళ్ల రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా వుంటాయ్. అందుకే చక్కెర పదార్ధాలకు దూరంగా వుండాలి.

అలాగే గోంగూర వంటి ఆకుకూరలు కూడా తినకూడదాన్న అపోహలున్నాయ్. అయితే, గోంగూరలో చాలా రకాల విటమిన్లు, మినరల్స్ వుంటాయ్.

గోంగూర తినడం వల్ల చక్కెర స్థాయులు అదుపులో వుంటాయే తప్ప పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. సో, డయాబెటిక్ పేషెంట్లు నిరభ్యంతరంగా గోంగూరను తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. అయితే, షుగర్‌తో పాటూ, ఫైలేరియా వంటి ఇతరత్రా వ్యాధులున్నవాళ్లు గోంగూరకు దూరంగా వుంటేనే మంచిది.

సహజంగా గోంగూరలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ గోంగూర పాత్ర కీలకం. దీనిలోని విటమిన్లు ఎముకలు ధృడం చేయడానికి తోడ్పడతాయ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com