జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే!
- June 24, 2024
ముంబై: ఐదు టీ20ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ప్రకటించింది. అజిత్ అగార్క్ సారథ్యంలోని భారత సెలెక్షన్ కమిటీ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు వివరాలను వెల్లడించింది.
అందరూ ఊహించినట్లుగానే ఈ సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉన్నారు. ఐపీఎల్లో సత్తా చాటిన ప్లేయర్లకు సెలెక్టర్లు అవకాశం కల్పించారు. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసిన సెలెక్టర్లు..యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్‌లకు ఈ జట్టులో అవకాశం కల్పించారు.
వికెట్ కీపర్లుగా వెటరన్ ప్లేయర్ సంజూ శాంసన్‌తో పాటు యువ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. తెలుగు తేజం,పేస్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి టీమిండియా పిలుపును అందుకున్నాడు. ఐపీఎల్లో సత్తా చాటిన రియాన్ పరాగ్‌కు కూడా అవకాశం దక్కింది.
వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్ స్పిన్ ఆల్రౌండర్లుగా చోటు దక్కించుకోగా. ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ తుషార్ దేశ్‌పాండేలు పేసర్లుగా ఎంపికయ్యారు.
జూలై 6 నుంచి 14 వరకు జింబాబ్వేలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 జూలై 6న, రెండో టీ20 జూలై 7న, మూడో టీ20 జూలై 10న, నాలుగో టీ20 జూలై 13న, ఐదో టీ20 జూలై 14న జరగనుంది.
అయితే ఈ పర్యటనకు హెడ్ కోచ్‌గా ఎవరు వ్యవహరిస్తారనే విషయంపై బీసీసీఐ క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఈ టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించిన బీసీసీఐ.. గౌతమ్ గంభీర్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక జింబాబ్వే పర్యటనకు ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది.
జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత జట్టు వివరాలు:
శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజూ శాంసన్(కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్‌పాండే.

తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







