‘ఎస్ బాస్’ సినిమా షూటింగ్ పూర్తి
- June 25, 2024
హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్.యూనివర్సిటీ చైర్మన్ కొనేరు సత్యనారాయణ సినీ రంగంలోనూ రాణిస్తున్నారు. కె స్టూడియోస్ బ్యానర్‌పై ‘రాక్షసుడు’, ‘ఖిలాడి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన ఆయన ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ఎస్ బాస్’ను రూపొందిస్తున్నారు. కాంచన కోనేరు సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మిస్టరీ థ్రిల్లర్ ‘సెవన్’ తర్వాత డైనమిక్ యాక్టర్ హవీష్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ‘నువ్విలా’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన హవీష్, ‘రామ్ లీల’, ‘జీనియస్’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశోక్ ‘ఎస్ బాస్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లా అన్నీ అంశాలతో రూపొందుతోంది. మంగళవారం హవీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎస్ బాస్ చిత్రం నుంచి హవీష్ స్టైలిష్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యింది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కతోన్న ‘ఎస్ బాస్’ చిత్రంలో ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ప్రముఖ రచయిత ఆకుల శివ ఈ చిత్రాన్ని కథ, మాటలను అందించారు. సీనియర్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించారు. ఆయన ఈ చిత్రంలో నటిస్తుండటంతో ఎంటర్టైన్మెంట్ నెక్ట్స్ రేంజ్లో ఉంటుందనటంలో సందేహం లేదు. ప్రముఖ టెక్నీషియన్ కబీర్ లాల్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







