తప్పుడు వార్తల పై కువైట్ మంత్రివర్గం సీరియస్..!
- June 26, 2024
కువైట్: విశ్వసనీయత మరియు జాతీయ ప్రయోజనాలను ప్రమాదంలో నెట్టివేసే సోషల్ మీడియా , ఇతర మీడియా వార్తలను కువైట్ కేబినెట్ తప్పుబట్టింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారం తీవ్రమైన అనర్ధాలను కలుగజేస్తుందని పేర్కొంది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబాహ్ అధ్యక్షతన బయాన్ ప్యాలెస్‌లో మంత్రివర్గం సమావేశమైంది. మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు తీసుకున్న చర్యలపై ఇటీవల అవాస్తవ నివేదికలను ప్రచురించినందుకు ఇది కొన్ని సోషల్ మీడియా సైట్‌లు మరియు వార్తా సేవలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు వార్తలను ప్రచురించడం లేదా తిరిగి ప్రచురించడం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. పుకార్లు మరియు తప్పుడు సమాచారంతో ప్రమేయం ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







