79 మంది ఏజెంట్లు, పంపిణీదారులపై జరిమానా
- June 27, 2024
రియాద్: 2023 సంవత్సరంలో కాంపిటీషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఏజెంట్లు మరియు పంపిణీదారులతో సహా ఆటోమొబైల్ రంగంలో పనిచేస్తున్న 79 సంస్థలపై అభియోగాలను సౌదీ జనరల్ అథారిటీ ఫర్ కాంపిటీషన్ నమోదు చేసింది. వీటిలో 64 సంస్థలపై అథారిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ప్రస్తుతం మిగిలిన 15 సంస్థలపై ఉన్న కేసుల పరిష్కారం కోసం సమర్పించిన అభ్యర్థనలను పరిశీలిస్తోంది. వివిధ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వీటిలో మూడు ఫార్మసీలు, నాలుగు రిటైల్ మార్కెట్లు ఉన్నాయి. పౌల్ట్రీ మరియు గుడ్ల ఉత్పత్తి రంగంలో పనిచేస్తున్న మూడు సంస్థలు నిబంధనలు ఉల్లంఘించి తక్కువ ధరలను నిర్ణయంచడంపై కేసులు నమోదయ్యయి. SR600 మిలియన్ల బిడ్‌లలో ప్రధాన కంపెనీలతో కుమ్మక్కైనందుకు ఆరు సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. సెటిల్‌మెంట్ లకు సంబంధించిన పక్రియను నిర్వహించడంలో విఫలమైనందుకు రెండు హోల్‌సేల్ సంస్థలపై క్రిమినల్ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్టు అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







