మానసిక ఆరోగ్యానికి ఇవి మేలు చేస్తాయి
- July 03, 2015
కేవలం శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. కానీ కొందరు కేవలం శరీరం ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవడంలాంటివి మాత్రమే చేస్తుంటారు. కానీ శరీరంతో పాటు మనసు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం మనిషి ఆరోగ్యంగా ఉన్నట్లు. మానసిక ఆరోగ్యం అంటే మెదడు ఆరోగ్యంగా ఉన్నట్లు. మన మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, ముఖ్యంగా మనం తినే ఆహారంలో ఇవి తరచుగా ఉండేలా చూసుకోవాలి. చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. అయితే చేపల్లో ఉండే ఫాటీ ఆమ్లాలు మెదడుకు ఎంతో అవసరం అయిన ‘సెలీనియం’ను అందిస్తాయి. దాంతో మెదడు చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది. ఎదిగే పిల్లల్లో చేపలు తరచూ తీసుకుంటే ఎంతో మంచిది. ఆలీవ్ ఆయిల్ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు. సాధారణంగా వాడే ఆయిల్లో రోజూ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి వాడడం ఎంతో మంచిది. ఇది ఒత్తిడిని తగ్గించి, మెదడు పని తీరుని మెదుగుపరుస్తుంది. ఇక తృణదాన్యాలు. వీటిని వారంలో కనీసం నాలుగు సార్లైనా తీసుకుంటే మంచిది. తృణధాన్యాలతో చేసిన జావ ఉదాహరణకు రాగి జావలాంటి వాటిని ప్రతిరోజూ ఉందయం ఒక గ్లాసు తీసుకుంటే మెదడుకు రక్త ప్రసరణ బాగా జరిగి రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వీటిలో కొవ్వుశాతం కూడా తక్కువ. శరీరానికి తగినంత శక్తిని కూడా అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









