వెజిటబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్
- July 03, 2015
కావలిసిన పదార్ధాలు
బాసుమతి రైస్ - పావుకిలో
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక చెంచా
వెల్లుల్లి రెబ్బలు - నాలుగు
ఎండుమిర్చి - మూడు
నెయ్యిలేదానూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఎగ్స్ - రెండు
క్యాబేజీ తురుము - కప్పు
పచ్చి బఠానీ - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కట్ట
సోయ సాస్ - అర స్పూన్
ఉల్లి కాడలు - మూడు
క్యారెట్ - రెండు
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పక్కన ఉంచాలి. గుడ్లలో చిటికెడు ఉప్పు వేసి బాగా గిలక్కొట్టాలి. మిక్సీలో వెల్లుల్లి, ఎండుమిర్చి, చిటికెడు ఉప్పు కలిపి మెత్తగా నూరాలి. ఒక బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజీ తురుము, క్యారెట్ ముక్కలు, పచ్చిబఠానీలు, ఉల్లికాడలు, మిక్సీ వేసిన ఎండుమిర్చి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తరువాత దానిలో సోయాసాస్ కలపాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మొదట గిలక్కొట్టి పెట్టిన ఎగ్ మిశ్రమాన్ని పెనం మీద అట్టులా వేసి ఈ అన్నం మిశ్రమంలో చిదిమినట్టుగా వేసి బాగా కలపాలి. చివరిగా కొత్తిమీర తురుము, అవసరమైతే కొద్దిగా వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్టీ టేస్టీ వెజిటబుల్ ఎగ్ ప్రైడ్ రైస్ రెడీ.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!







