శరీరంలోని వేడి తగ్గించుకునే మార్గాలివే.!
- June 28, 2024
కొందరికి ఒంట్లో విపరీతమైన వేడి వుంటుంది. ఎప్పుడూ చేతులూ, కాళ్లూ వేడిగా వుంటుంటాయ్. శరీరం కూడా జ్వరం తాలూకు లక్షణాలు లేకున్నా వేడిగా అనిపిస్తుంటుంది.
సహజసిద్ధమైన ఉస్ణోగ్రతే అయినా కొన్ని సార్లు ఈ వేడిని తట్టుకోవడం కష్టమే అనిపిస్తుంది. నిరంతరం చన్నీటిలో వుండాలనిపించేలా.. లేదంటే ఏసీలోనే వుండాలనిపించేలా శరీరం ప్రోత్సహిస్తుంది.
కానీ, అది మంచిది కాదు, అలా శరీర ఉష్ణోగ్రతని తగ్గించుకోవాలనుకునేవారు ఈ పండ్లను తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పండ్లు ఎల్లప్పుడూ ఆరోగ్యానికి మంచివే. ఆరోగ్యంగా వుండాలంటే ఖచ్చితంగా డైట్లో కొన్ని పండ్లు రెగ్యులర్‌గా చేర్చుకోవాల్సిందే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలో 90 శాతం నీరే వుంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడంతో అత్యంత కీలకంగా పని చేస్తుంది. అలాగే నిమ్మకాయలోని సి విటమిన్ ఆరోగ్యానికి అనేక రకాల మంచి చేయడంతో పాటూ, అననుకూల శరీర ఉష్ణోగ్రతల్ని తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
దానిమ్మ కాయలో రక్త ప్రసరణను మెరుగు పరిచి శరీరంలో తేమ శాతం పెంచే గుణం ఎక్కువ. అందుకే శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా వుండేవారు దానిమ్మకాయల్ని రెగ్యులర్‌గా తింటుండాలి.
పైనాపిల్, బొప్పాయి పండ్లలోని బ్రోమోలిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటూ, శరీరాన్ని కూల్‌గా వుంచడంలో తోడ్పడుతుంది. అందుకే వారంలో రెండు సార్లయినా ఈ పండ్లను తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







