హారర్ జపం చేస్తున్న తమన్నా.!
- June 28, 2024
అందాల భామ తమన్నా వరుస పెట్టి హారర్ సినిమాల్లో నటిస్తోంది. మొన్నీ మధ్యనే ‘అరుణ్మలై 4’ తెలుగులో ‘బాక్’ పేరుతో రిలీజైన హారర్ మూవీలో నటించింది. ఈ సినిమాలో తమన్నా అందమైన దెయ్యంగా కనిపించింది.
ఆకట్టుకునే పర్‌ఫామెన్స్ కూడా ఇచ్చింది. ఓ భయంకరమైన క్షుద్ర రాక్షసుడి బారి నుంచి తన పిల్లల్ని కాపాడుకునే తల్లి ఆత్మగా తనదైన పర్‌ఫామెన్స్‌తో హావ భావాలతో ఆకట్టుకున్న తమన్నాకి విమర్శకుల ప్రశంసలు అందాయ్.
ఇప్పుడు మళ్లీ మరో హారర్ సినిమాతో రాబోతోంది. అదే ‘స్త్రీ 2’. గతంలో వచ్చిన ‘స్త్రీ’ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందింది. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయ్.
ఈ సినిమాలో అందాల ఆరబోతతో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించబోతోంది తమన్నా. అలాగే కొన్ని ఇంపార్టెంట్ హారర్ సీన్లలోనూ తన ప్రతాపం మరోసారి చూపించబోతోందట. దీంతో పాటూ, తమన్నా చేతిలో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయ్.
అందులో ఒకటి సన్యాసిని పాత్ర కూడా వుంది. అలాగే మరికొన్ని కమర్షియల్ సినిమాలతోనూ తమన్నా బిజీగా వుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







