డేటా ట్యాంపరింగ్.. SR500,000 జరిమానా
- June 29, 2024
రియాద్: సౌదీ అరేబియాలోకి దిగుమతి కాకుండా నిషేధించబడిన ఒక రకమైన చేపల డేటాను తారుమారు చేసిన ఖాసిమ్ ప్రాంతంలోని ఒక సంస్థపై సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) SR500,000 జరిమానా విధించింది. సౌదీ అరేబియా వెలుపలి నుంచి దిగుమతి చేసుకున్న గిడ్డంగిలో ఎనిమిది రకాల చేపలు ఉన్న షిప్‌మెంట్‌ను తనిఖీ చేసిన తర్వాత పెనాల్టీ విధించినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. తనిఖీ సందర్భంగా ఇన్స్పెక్టర్లు షిప్మెంట్లోని చేపల రకాల్లో ఒకదాని పేరుపై అనుమానాలు కలిగాయి. లేబుల్ మరియు కస్టమ్స్ డిక్లరేషన్‌లోని డేటా దిగుమతి చేసుకున్న చేపల స్పష్టమైన రూపానికి సరిపోలలేదు. నమూనాలు తీసుకొని చెక్ చేయగా, దిగుమతి చేసుకున్న రకాల్లో ఒకటి లేబుల్‌లో చేర్చబడిన వాటితో సరిపోలడం లేదని స్పష్టమైంది. ఇది నది తిలాపియా రకమని, దీని దిగుమతిని సౌదీ నిషేధించింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు SR500,000 జరిమానా విధించినట్టు వెల్లడించింది. ఏదైనా సంస్థల్లో ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘనలను గమనించినప్పుడు, 19999కి కాల్ చేయడం ద్వారా నివేదించాలని వినియోగదారులకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







