కొత్త ఎస్పోర్ట్స్, గేమ్ డిజైన్ అకాడమీ.. విద్యార్థులకు స్కాలర్షిప్లు
- July 01, 2024
యూఏఈ: యూఏఈలోని అన్ని GEMS పాఠశాలల్లో తదుపరి తరం ఎస్పోర్ట్స్ ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో కొత్త ఎస్పోర్ట్స్ మరియు గేమ్ డిజైన్ అకాడమీ సెప్టెంబర్ 2024లో ప్రారంభించనున్నారు. ఈ అకాడమీ స్కాలర్షిప్ ప్రైజ్ ఫండ్‌ను ప్రకటించింది. విద్యార్థులకు వారి సమగ్ర అభివృద్ధికి భరోసానిస్తూ వేగంగా అభివృద్ధి చెందుతున్న పోటీ గేమింగ్, గేమ్ డిజైన్ రంగాలలో అవకాశాలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ చొరవ దేశాన్ని గ్లోబల్ గేమింగ్ మరియు ఎస్పోర్ట్స్ హబ్‌గా స్థాపించడానికి విస్తృత యూఏఈ వ్యూహంతో జతకట్టింది. దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ 2033 నాటికి 30,000 ఉద్యోగాలను సృష్టించేందుకు $1 బిలియన్ ఎకోసిస్టమ్‌తో అగ్రగామిగా ఉందని GEMS గ్లోబల్ గ్రూప్ చైర్మన్ , వర్కీ ఫౌండేషన్ మరియు GEMS ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు సన్నీ వర్కీ తెలిపారు. ఎస్పోర్ట్స్ మరియు గేమ్ డిజైన్ అకాడమీని ప్రారంభించడం విద్యార్థులకు ప్రముఖ పరిశ్రమలలో నిమగ్నమయ్యే అవకాశాలను అందించడంలో మా నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!
- కువైట్‌లో మాదకద్రవ్యాలతో రూలింగ్ ఫ్యామిలీ మెంబర్ అరెస్ట్..!!
- ఖతార్–కెనడా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దిశ..!!
- సౌదీపై దాడులను ఖండించిన పలు దేశాలు..!!
- యూఏఈ జాతీయ దినోత్సవం.. వాహనదారులకు శుభవార్త..!!
- విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!
- ఒమన్‌లో ‘గల్ఫ్ ఆట’ ఆవిర్భావం..ప్రవాస భారతీయుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇక ముందుగానే మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!
- సౌదీపై హౌతీల దాడి..నేపాల్ కార్మికుడు మృతి, పలువురికి గాయాలు..!!
- ఖతార్‌లో ఊపందుకుంటున్న సినీ పరిశ్రమ..!!







