సత్యం రాజేష్.! ‘పొలిమేర’తో దక్కించుకున్న పాపులారిటీ ఏమైంది.!
- July 01, 2024
‘సత్యం’ సినిమాతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రాజేష్, ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల ‘పొలిమేర’ పార్ట్ 1, పార్ట్ 2 సినిమాలతో హిట్టు మీద హిట్టు కొట్టాడు సత్యం రాజేష్.
తాజాగా సత్యం రాజేష్ నుంచి వచ్చిన చిత్రం ‘టెనెంట్’. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకి ఓటీటీలో భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయ్.
‘చంద్రుడి మీదికెళ్లినా ఆడవాళ్లకు రక్షణ లేదు.. మీ భద్రత మీ బాధ్యత..’ అనే స్లోగన్‌తో సినిమాని ఎండ్ చేయడం ఏమంత కన్విన్సింగ్‌గా అనిపించడం లేదన్నది ఓటీటీ ప్రేక్షకుల అభిప్రాయం.
ఈ సినిమాలో లీడ్ రోల్స్ అన్నీ చనిపోతాయ్ సత్యం రాజేష్‌తో సహా. నిజానికి అలా చంపాల్సిన అవసరం లేదు. ఇంకాస్త స్పాన్‌తో ఈ సినిమాని నడిపించొచ్చు. కానీ, ఎందుకో తెలీదు, అన్ని క్యారెక్టర్స్‌నీ చంపేసి.. చివరికి పై స్లోగన్‌తో సినిమాని ఎండ్ చేసేశారు.
ఏం సందేశం ఇస్తున్నట్లు దీనితో. ఆకాశంలో సగం, అన్నింటా సగం.. అంటూ ఆడవాళ్లు మగవాళ్లతో సమానంగా దూసుకెళ్తున్న రోజులివి. ఎక్కడో కొన్ని చోట్ల పొరపాట్లు జరిగితే జరగొచ్చు గాక.! ఆ మాటకొస్తే.. ఆడవాళ్ల చేతుల్లో మోసపోతున్న మగవాళ్ల సంఖ్య ఎంత మేర బయటపడుతోంది.?
సినిమాలు సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంత మాత్రం యూజ్ కావని ఈ తరహా సినిమాలు చేసే, చేయాలనుకుంటున్న మేకర్లు తెలుసుకుంటే మంచిది.! అనేది సగటు ఓటీటీ ప్రేక్షకుడి అభిప్రాయం.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







