అల్లరి నరేష్.! ఎందుకు తగ్గాలి ఎవరి కోసం తగ్గాలి.?
- July 01, 2024
‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి నోట విన్నా.. ఏ సందర్భమైనా ఈ మాటను చాలా ఈజీగా వాడేస్తున్నారందరూ ‘పుష్ప’ తర్వాత.
ఇప్పుడు అల్లరి నరేష్ వచ్చాడు. ‘ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి..’ అంటూ ఇంకాస్త ముందుకెళ్లాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. మొన్నా మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే అల్లరోడు మంచి మార్కులు కొట్టేశాడు.
తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అల్లరి నరేష్ ఈ డైలాగ్ పలుకుతున్నాడు. గెటప్ చూస్తే కాస్త ‘పుష్ప’ పోలికలున్నాయ్.
ఒక్కటే చేత్తో మందు బాటిల్లోంచి గ్లాస్‌లోకి మందును పోస్తూ ఓ సీరియస్ యాక్షన్ సీన్లో వున్న అల్లరి నరేష్ చేత డైరెక్టర్ ఈ డైలాగ్ పలికించాడు. డైలాగ్‌కీ ఓ రేంజ్లో రెస్పాన్స వస్తోంది. సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని డైలాగులున్నాయో ఏమో కానీ, ఇప్పటికైతే ‘పుష్ప’ డైలాగ్‌ని ‘బచ్చల మల్లి’గాని డైలాగ్ కొట్టేసిందంతే.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







