కొత్త సినిమా షురూ చేసిన బెల్లంకొండ.!
- July 01, 2024
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హంగామా కాస్త తగ్గింది. మొదట్లో ఏడాదికో సినిమా చేసిన బెల్లంకొండ కుర్రోడు ఈ మధ్య లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. వరుసగా 10 సినిమాలు చేసేసిన బెల్లంకొండ శ్రీనివాస్ అందులో నాలుగైదు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోలేదు. అలాగే కొన్ని సెన్సేషన్ విజయాలు కూడా లేకపోలేదు.
తాజాగా తన 11 వ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. కౌశిక్ అనే కొత్త కుర్రోడు తెరకెక్కిస్తున్న సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
వెరీ లేటెస్ట్‌గా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వెలుగుకీ, చీకటికీ మధ్య జరిగే సంగ్రామంగా ఈ సినిమా కథ గురించి గతంలోనే హింట్ ఇచ్చారు.
సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలతో పాటూ, కొన్ని హారర్ అంశాలను కూడా ఈ సినిమాలో జోడించినట్లు తెలుస్తోంది. అయితే, ఓ డిఫరెంట్ హారర్ జోనర్‌గా ఈ సినిమాని అభివర్ణిస్తున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా వుంది.

‘రాక్షసుడు’ సినిమా తర్వాత అనుపమా పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీవివాస్ ఈ సినిమా కోసం మళ్లీ జత కడుతున్నారు. చూడాలి మరి బెల్లంకొండకి ఈ హారర్ జోనర్ ఎంత మేర కలిసొస్తుందో.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







