‘కల్కి’ సినిమా విషయంలో ఆ నిర్షయం తీసుకున్నారా.?
- July 01, 2024
‘కల్కి2898ఏడీ’ ఈ నెల 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిన్నపాటి లాజిక్కులు పక్కన పెట్టేసి, సినిమాని సినిమాగా చూస్తే ‘కల్కి’ ఈ మధ్య ప్రబాస్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒకింత బెటర్ ఛాయిస్ అనే చెబుతున్నారు సినీ మేథావులు.
అయితే, పురాణాల నేపథ్యంగా తీసుకుని నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ తర్వాత అనేక రకాల చర్చోపచర్చలు మొదలయ్యాయనుకోండి. ఓ సామాన్య మానవుడికీ, పురాణ పురుషుడయిన అశ్వత్థామకీ పైట్లు పెట్టడమేంటి.? కర్ణుడు పాండవుల వ్యతిరేకి కదా.? అయినా కర్ణుడు కూడా పాండవుల సోదరుడే కదా.? ప్రబాస్ కర్ణుడయితే, కల్కిగా పుట్టబోయేది ఎవరు.? అబ్బో.! ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు. పదుల సంఖ్యలో అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయ్. డిస్కషన్ష్ జరుగుతున్నాయ్.
‘కల్కి’ పుణ్యమా అని పురాణాల్లో పట్టు సాధించేలా చర్చలు జరుగుతున్నాయనుకోండి అది వేరే విషయం. ఆ సంగతి పక్కన పెడితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ‘కల్కి’. సో, ఈ సినిమా చూడాలంటే భారీ మొత్తంలో టిక్కెట్టు వ్యత్యించాల్సిందే.
అయితే, వీకెండ్ పూర్తయ్యేసరికి ‘కల్కి’ సినిమా టిక్కెట్ల విషయంలో ఒకింత తగ్గుదల కనిపించే అవకాశాలున్నయని ఇన్‌సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం. ఒకవేళ అదే నిజమైతే టికెట్‌పై ఎంత తగ్గుతుంది అనేది చూడాలి మరి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







