అమెరికా ప్రభుత్వం ఆఫర్ చేసే హెచ్-1బీ వీసాలో మార్పులు
- June 13, 2016
వలసేతర ప్రజలకు అమెరికా ప్రభుత్వం ఆఫర్ చేసే హెచ్-1బీ వీసాలో మార్పులు కానున్నాయా..? అంటే చాలా మంది అమెరికా చట్టసభ సభ్యులు మార్పులపైనే మొగ్గుచూపుతున్నారట. వీసా చట్టాలపై సమీక్షించాలని ప్రతిపాదించారట. హెచ్-1బీ వీసాలతో అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని చట్టసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అమెరికా కంపెనీలు సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ ప్రొగ్రామింగ్ వంటి సాంకేతిక పరిజ్క్షానం కలిగి ఉద్యోగులను తమ కంపెనీలలో తీసుకునేందుకు హెచ్-1 బీ వీసాలను వినియోగిస్తుంటాయి. భారత్, ఇతర ప్రాంతాలనుంచి వచ్చే వలసేతరలకు హెచ్-1బీ వీసా, ఇతర వీసాల ద్వారా ఉద్యోగాలు కల్పించడం వల్ల చాలామంది అమెరికన్ వర్కర్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని చట్టసభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ ఉద్యోగుల తొలగింపుతో పాటు వీసాలో మార్పులు చేయాలని చట్టసభ్యులు ప్రతిపాదిస్తున్నారు. తాత్కాలిక వీసా ఒప్పందాలపై వచ్చే ఉద్యోగులు వారి హక్కులపై పోరాడే విషయాలపై యూఎస్ కాంగ్రెస్ లోని మెజార్టీ సభ్యులు ప్రశ్నలను సంధించారు. చట్టసభ్యులు, సెనెట్ డెమొక్రాట్ లో రెండో అతిపెద్ద ర్యాంకింగ్ వ్యక్తి ఇల్లినాయిస్ రిచార్డ్ డర్బిన్, ఇమిగ్రేషన్ సెనెట్ జ్యుడిషియరీ సబ్ కమిటీ రిపబ్లిక్ చైర్మన్ జెఫ్ సెషన్స్ అలబామలు వీసాలో మార్పులు చేయాలని, మాజీ ఉద్యోగులకు తమ తొలగింపుపై పోటీ ఇవ్వాలని ప్రతిపాదించారు. కార్మికుల నుంచి ప్రతీకార బెదిరింపులను తాను వర్కర్స్ నుంచి విన్నానని సెనెటర్ రిచార్డ్ బ్లుమేన్తాల్ చెప్పారు. నిబంధనల్లో చాలా లొసుగులు ఉన్నాయని, గత ఐదేళ్లలో హెచ్-1బి వీసా, ఇతర తాత్కాలిక వీసాలతో వేయికి పైగా అమెరికన్ వర్కర్లని విదేశీయులతో భర్తీ చేశారని రట్జర్స్ యూనివర్సిటీ లేబర్ ఫోర్స్ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ లు మాత్రమే లేబర్ చట్టాలు గురించి మాట్లాడే అర్హత ఉంటుందని, గ్లోబల్ ఔట్ సోర్సింగ్ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్లు దీనిపై మాట్లాడటానికి అర్హత లభించడం లేదని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









