భారత దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
- July 02, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో నాలుగు రోజులు పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో రెండురోజుల క్రితం కుండపోత వర్షం కురిసింది. ఈ క్రమంలో గత 88ఏళ్ల నాటి రికార్డును మించి వర్షం కురిసిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్, ఈశాన్య జార్ఖండ్, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, సౌరాష్ట్ర, కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతం, జమ్మూ కచ్‌లలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
కాశ్మీర్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ , పశ్చిమ అస్సాంతో పాటు.. ఢిల్లీ, పంజాబ్, వాయువ్య రాజస్థాన్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరాఖండ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ ఒడిశాలో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలుకురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతమైన ఒడిశా, జార్ఖండ్, విదర్భ, ఉత్తర కొంకణ్, మరఠ్వాడా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కోస్టల్ సౌత్ ఇంటీరియర్ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







