‘ఓదెల 2’ కోసం తమన్నా యాక్షన్.! మామూలుగా వుండదు.!
- July 02, 2024
హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమా గతంలో ఓటీటీ వేదికగా రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతవరకూ గ్లామర్ డాళ్‌గా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్‌ని ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్స్‌లో చూపించి షాకిచ్చాడు డైరెక్టర్.
అంతే కాదు, ఆమె స్టన్నింగ్ పర్ఫామెన్స్ కూడా అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది ఈ సినిమాలో. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోంది. అదే ‘ఓదెల 2’. ఈ సీక్వెల్ కోసం స్టార్ హీరోయిన్ అయిన తమన్నా భాటియాని తీసుకొచ్చారు.
తమన్నా ప్రధాన పాత్రలో హెబ్బా పటేల్ కీలక పాత్రలో ఈ సినిమా రూపొందబోతోంది. ఇక, సినిమా నేపథ్యం విషయానికి వస్తే, కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.
అందుకోసం ఇన్నోవేటివ్‌గా యాక్షన్ సీన్లు తెరకెక్కిస్తున్నారనీ తెలుస్తోంది. బాలీవుడ్ స్థాయి స్టంట్ కొరియోగ్రఫర్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారట. తమన్నా, హెబ్బా పటేల్‌పై డిఫరెంట్ యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారట.
ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!
- హవా అల్ మనామా ఫెస్టివల్ రెండు రోజులపాటు పొడిగింపు..!!
- జనవరి 19న సివిల్ డిఫెన్స్ సైరన్ టెస్ట్ రన్..!!
- యూఏఈలో నెస్లే ఇన్ఫాంట్ ఫార్ములా అదనపు బ్యాచ్‌ల రీకాల్..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు లెటర్ రాసిన ఒమన్ సుల్తాన్..!!







