సౌదీలో గృహ కార్మికులకు ఆరోగ్య బీమా అమలు
- July 02, 2024
రియాద్: సౌదీ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ (CHI) మరియు ఇన్సూరెన్స్ అథారిటీ (IA).. యజమాని వద్ద నమోదు చేసుకున్న గృహ కార్మికులు, వారి సంఖ్య నలుగురి కంటే ఎక్కువగా ఉంటే వారికి హెల్త్ బీమా అమల్లోకి వచ్చింది. ఆరోగ్య బీమా కంపెనీ నుండి ఆమోదం పొందడం, కార్మికులందరికీ బీమాను కవర్ చేయడం వరకు మార్గదర్శకాలను విడుదల చేశారు. లబ్దిదారులందరికీ సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందజేయడానికి ఈ నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించినట్లు పేర్కొన్నాయి. గృహ కార్మికుల బీమా పాలసీ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్యం మరియు అత్యవసర పరిస్థితులను కవర్ చేస్తుందని CHI ప్రతినిధి ఇమాన్ అల్-తారిఖీ తెలిపారు. ఇది చెల్లింపు లేకుండా ఆసుపత్రిలో చేరడం, అపరిమిత సందర్శనలతో అత్యవసర క్లినిక్ చికిత్స, టీకాలు మరియు వైద్య తనిఖీలను కలిగి ఉంటుందని వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







