అలాంటి వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదు: రేవంత్ రెడ్డి వార్నింగ్
- July 02, 2024
హైదరాబాద్: డ్రగ్స్ వినియోగం, సైబర్ క్రైమ్‌పై సినిమాల్లో అవగాహన కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలా కల్పించని వారి సినిమాలకు టికెట్ల ధరలు పెంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ పరిశీలించిన రేవంత్ రెడ్డి.. అనంతరం యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిపార్ట్మెంట్స్ కు నూతన వాహనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినప్పటికీ సైబర్ క్రైమ్, డ్రగ్స్ కు దూరంగా ఉండాలంటూ సినిమాకు ముందు ప్రదర్శించాలని చెప్పారు. సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు నిర్మాతలు వస్తుంటారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని తెలిపారు.
డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందు కానీ సినిమా తరువాత 3 నిమిషాలు వీడియోతో అవగాహన కల్పించాలని చెప్పారు. అలా చేయని నిర్మాతలకు , డైరెక్టర్లకు, తారాగణానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవని తెలిపారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు కూడా సహకరించాలని, డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే వారి థియేటర్లుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
కాగా, పోలీస్ వ్యవస్థలో అనేక విభాగాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న బిగ్గెస్ట్ క్రైమ్ సైబర్ క్రైమ్ అని తెలిపారు. అత్యాచారాలు, మర్డర్ల కంటే పెద్ద క్రైమ్ గా సైబర్ క్రైమ్, డ్రగ్స్ మారాయని చెప్పారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రతి గల్లీకి గంజాయి పాకిందని తెలిపారు. కాలేజీల్లో విచ్చలవిడిగా గoజాయి దొరుకుతుందని చెప్పారు. వీటిని నియత్రించేందుకు అధికారులకు అన్ని అధికారాలు ఇచ్చామని తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







