అమరావతి, పోలవరం పూర్తికి సహకరించాలి: ఎంపీ బాలశౌరీ
- July 02, 2024
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరీ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంట్ లో రాష్ట్రపతి ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి సంబంధించిన పలు అంశాల పై సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు.
మచిలీపట్నం పోర్ట్ లో రిఫైనరీ పెట్టాలని, మచిలీపట్నం–రేపల్లే మధ్య రైల్వే లైన్ ఏర్పాలు చేయాలని, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో ప్రతి ఇంటికి మంచినీరు అందజేయడంతోపాటు గ్రీన్ ఎనర్జీని అందజేసే ప్రాజెక్టులను ప్రోత్సాహించాలని కేంద్రాన్ని కోరారు. ఏపీలోని కౌలు రైతులకు తక్కువ వడ్డీ రుణాలు అందజేయాలని ప్రత్యేకంగా ప్రధాని మోదీని ఎంపీ బాలశౌరీ కోరారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







