అమెజాన్‌లో ప్రైమ్ డే సేల్ 2024..
- July 02, 2024
అమెజాన్ ఈ ఏడాదిలో అతిపెద్ద సేల్ ఈవెంట్ అమెజాన్ ప్రైమ్ డే 2024 జూలై మూడవ వారంలో ప్రారంభం కానుంది. మొత్తం రెండు రోజుల ఆన్‌లైన్ సేల్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. వినియోగదారుల టెక్నికల్ గాడ్జెట్ల నుంచి గృహోపకరణాల వరకు ఫ్యాషన్, దుస్తులు, అంతకుమించిన కేటగిరీలపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. మునుపటి ఏళ్లలో మాదిరిగా అమెజాన్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీల ద్వారా చేసిన చెల్లింపులపై సేవింగ్స్ అందించనుంది. ఎకో డివైజ్‌ల వంటి అమెజాన్ ప్రొడక్టులు కూడా సేల్ సమయంలో ధర తగ్గింపులను అందుకోనున్నాయి.
ఆన్‌లైన్‌లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఎనిమిదో ఎడిషన్ జూలై 20, శనివారం ఉదయం 12:00 గంటలకు ప్రారంభమై జూలై 21 ఆదివారం రాత్రి 11:59 గంటలకు ముగియనుందని కంపెనీ ప్రకటించింది. ఈ 48 గంటల సేల్ ఈవెంట్‌లో 450కి పైగా భారతీయ, ఇంటెల్, శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ, హానర్, సోనీ, ఆసుస్ వంటి మరిన్ని గ్లోబల్ బ్రాండ్‌ల నుంచి కొత్త ప్రొడక్టు లాంచ్‌లు ఉండనున్నాయి. అమెజాన్ ప్రైమ్ డే 2024లో ఇంటితో పాటు కిచెన్, ఫ్యాషన్ వస్త్రధారణ, ఆభరణాలు, చేతితో తయారు చేసిన ఉత్పత్తులు, మరెన్నో కేటగిరీలలో చిన్న, మధ్యస్థ వ్యాపారాల నుంచి వేలకొద్దీ కొత్త లాంచ్‌లు ఉండనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ డే 2024 సందర్భంగా.. కొనుగోలుదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి చెల్లింపుపై 10 శాతం సేవింగ్స్ పొందవచ్చు. ఈ ప్రత్యేక బెనిఫిట్స్ డీల్‌ను పొందాలంటే.. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 2,500 వరకు వెల్ కమ్ రివార్డ్‌లను పొందవచ్చు. అలాగే, క్యాష్‌బ్యాక్ రూ. 300 (ప్రైమ్ మెంబర్లకు మాత్రమే) సేల్ సమయంలో రూ. 2,200 రివార్డులు పొందవచ్చు.
అమెజాన్ రాబోయే ప్రైమ్ డే సేల్ ఫ్లాగ్‌షిప్ అమెజాన్ ప్రొడక్టుల్లో కూడా డీల్‌లతో అందుబాటులో ఉంది. ఎకో స్మార్ట్ స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్‌లు 55 శాతం వరకు తగ్గింపు పొందుతాయి. ఈ సేల్ ఆఫర్‌లతో పాటు, అమెజాన్ మిలియన్ల కొద్దీ ఉత్పత్తులకు ఒకే రోజు, మరుసటి రోజు డెలివరీ అందించనుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024 అనేది ప్రైమ్ మెంబర్లకు మాత్రమే ప్రత్యేకమైన ఈవెంట్ అని చెప్పవచ్చు. డిస్కౌంట్ సేల్‌లో వినియోగదారులు ప్రైమ్ మెంబర్‌షిప్‌ని కొనుగోలు చేయవచ్చు. మీరు ఇప్పటికే ప్రైమ్ మెంబర్ కాకపోతే, సేల్ సమయంలో కొనుగోళ్లకు మీరు 30-రోజుల ఫ్రీ ట్రయల్‌ని పొందవచ్చు.
భారత్‌లో ప్రైమ్ మెంబర్‌షిప్ ధర నెలకు రూ. 299, మూడు నెలలకు రూ. 599, ఏడాదికి రూ. 1,499కు అందిస్తోంది. 12 నెలలకు అమెజాన్ ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్ ధర రూ. 399కు అందిస్తోంది. ప్రైమ్ మెంబర్‌లు అర్హత ఉన్న వస్తువులపై ఫ్రీ ఫాస్ట్ డెలివరీని కూడా పొందవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేటెస్ట్ టీవీ షోలు, మూవీలను స్ట్రీమింగ్ చూడొచ్చు. ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఎంపిక చేసిన డీల్‌లు, మరిన్నింటికి స్పెషల్ యాక్సెస్‌ను పొందవచ్చు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







