‘జనక అయితే గనక’ ఫస్ట్ లుక్ విడుదల
- July 02, 2024
తెలుగు సినీ ప్రేక్షకులకు వైవిధ్యమైన సినిమాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న నిర్మాణ సంస్థ దిల్ రాజు ప్రొడక్షన్స్. ఈ బ్యానర్‌పై వచ్చిన బలగం ఎంత సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. లవ్ మీ వంటి డిఫరెంట్ లవ్ స్టోరీ తర్వాత ఈ బ్యానర్‌పై వస్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్సటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు.
ఫస్ట్ లుక్‌ను గమనిస్తే.. సినిమా టైటిల్ ఉన్న పలకను పట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓరగా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్టర్‌లో న్యాయదేవత బొమ్మ, చిన్నపిల్లలకు సంబంధించిన స్కూల్ బ్యాగ్, స్కూల్ బస్, టెడ్డీ బేర్ బొమ్మలను గమనించవచ్చు. హీరోగా వరుస విజయాలను అందుకుంటున్న సుహాస్ మరోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫరెంట్ మూవీతో అలరించటానికి సిద్ధమవుతున్నారు.
సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







