‘విరాజి’తో రాబోతున్న వరుణ్ సందేశ్..
- July 02, 2024
వరుణ్ సందేశ్ ఇటీవలే నింద సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతున్నాడు.తాజాగా నేడు వరుణ్ సందేశ్ తన నెక్స్ట్ సినిమా ‘విరాజి’ అని టైటిల్ అనౌన్స్ చేసారు. ఈ సినిమాని మహా మూవీస్ తో కలిసి M3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, ప్రసాద్ బెహరా.. పలువురు నటించారు.
విరాజి సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆగస్టు 2న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ‘విరాజి’ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ నిర్వహించారు. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూస్తుంటే హారర్, థ్రిల్లర్ స్టోరీ అని తెలుస్తుంది.
విరాజి సినిమా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. ఇది చాలా మంచి టైటిల్. వరుణ్ సందేశ్ గారు ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు చేసారు. ఆయన్ని కొత్త అవతారంలో ఈ సినిమా చూపిస్తుంది. ఆగస్టు 2న సినిమా రిలీజ్ చేస్తాం. నెల రోజుల్లో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తాం అని తెలిపారు.
డైరెక్టర్ ఆద్యంత్ హర్ష మాట్లాడుతూ.. డైరెక్టర్ గా ఇది నా మొదటి సినిమా, ఇది నా మొదటి ఈవెంట్. మా మూవీ ప్రాజెక్ట్ హెడ్ సుకుమార్ కిన్నెరకి, ప్రొడ్యూసర్ మహేంద్రకి థ్యాంక్స్ చెప్పాలి. వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేసారు.వరుణ్ సందేశ్ కు ఇది టైలర్ మేడ్ మూవీ అవుతుంది అని తెలిపారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. విరాజి కథ చెప్పేటప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశాను.సెకండాఫ్ విని నాకు గూస్ బంప్స్ వచ్చాయి. కథ చాలా బాగుంది. డైరెక్టర్ హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. నేను ఇటీవల చేసిన నింద సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.పదేళ్ల తర్వాత నా సినిమాకి అలాంటి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.నింద సినిమా సక్సెస్ నాకు మంచి మోటివేషన్, బూస్ట్ ఇచ్చింది. విరాజి సినిమాకు ఇంకో నెల రోజులు మాత్రమే టైం ఉంది. నా 17 ఏళ్ల కెరీర్ లో ఒక డిఫరెంట్ సినిమా ఇది. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం.ఈ క్యారెక్టర్ కోసం రెడీ అవ్వడానికి గంట సమయం పట్టేది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







