బాహుబలి చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది..
- June 13, 2016
'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం క్లైమాక్స్ చిత్రీకరణ మొదలైంది. ఈ నెల 13 నుంచి 10 వారాల పాటు నిర్విరామంగా పతాక సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నట్లు ఇటీవల తెలిపిన చిత్ర బృందం.. సోమవారం తెల్లవారుజాము నుంచి క్లైమాక్స్ షూట్‌ను ప్రారంభించినట్లు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపింది. సినిమా సెట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి స్నాప్ చాట్‌లో ఫాలో అవమని ట్వీట్ చేసింది. చిత్ర హీరో ప్రభాస్, ప్రతినాయకుడు రానా సెట్లో దిగిన ఫొటోలతోపాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి యూనిట్ సభ్యులకు ఏదో వివరిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. గత ఏడాది విడుదలైన 'బాహుబలి-ది బిగినింగ్'కి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









