భక్తులను మోసం చేస్తున్న దళారులపై చట్టపరమైన చర్యలు: TTD EO
- July 03, 2024
తిరుమల: టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ ఆన్లైన్ దరఖాస్తులకు ఆధార్‌ను అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్న టీటీడీ ఈవో.. ఇప్పుడు దళారీ వ్యవస్థను నిర్మూలించడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా నేడు (బుధవారం) తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో పోలీసు, టీటీడీ నిఘా, భద్రతా విభాగం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ… తిరుమల శ్రీవారి భక్తులను మోసం చేస్తున్న దళారులను గుర్తించి వారిపై ఎప్పటికప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇప్పటివరకు దళారులనపై నమోదైన కేసులను వారం రోజుల్లో పరిష్కరించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వసతి, దర్శనం, అర్ధతసేవ టిక్కెట్ల విషయంలో భక్తులను మోసం చేస్తున్న దళారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈఓ అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







