ఎంక్యాట్ పై అవగాహన కల్పించిన NATS
- July 03, 2024
అమెరికా: అమెరికాలో డాక్టర్ చదవాలనుకునే విద్యార్ధులకు అత్యంత కీలకమైన ఎంక్యాట్ పై నాట్స్ అవగాహన కల్పించింది.ఆన్లైన్ వేదికగా నిర్వహించిన ఈ అవగాహన సదస్సు మెడికల్ చదవాలనుకునే విద్యార్ధులకు దిశా నిర్థేశం చేసింది.ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన తెలుగు విద్యార్థి శ్రీచరణ్ మంచికలపూడి తన విజయానికి బాటలు వేసిన మార్గాలను వివరించారు. ఎంక్యాట్‌కు ఎలా సన్నద్ధం కావాలి..? ఏయే అంశాల మీద పట్టు సాధించాలి..? అందుకు అవలంబించాల్సిన మార్గాలేమిటి.? ఏ అంశాలను ఎలా నేర్చుకోవాలి.?ఎంక్యాట్‌లో అత్యుత్తమ మార్కుల కోసం ఎలా కృషి చేయాలి.? ఇలాంటి ఎన్నో అంశాలను శ్రీచరణ్ మంచికలపూడి చక్కగా వివరించారు.ముందుగా ఈ సదస్సులో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి వివరించారు. ఈ సదస్సుకు సంకీర్త్ కటకం వ్యాఖ్యాతగా వ్యవహరించారు.ఆన్లైన్ ద్వారా విద్యార్ధులకు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీచరణ్ మంచికలపూడికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!
- నీట్ పీజీ పరీక్ష తేదీ రిలీజ్
- గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- H-1B వీసాదారులకు షాక్..2027కు చేరిన ఇంటర్వ్యూ తేదీలు!
- ఫిబ్రవరి 11 నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు







