కర్ణాటక మాజీ సీఎం తనయుడు నిఖిల్ తెలుగులో..
- June 13, 2016
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ .డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ త్వరలో తెలుగు సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం. కన్నడ సినీ రంగంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రం ద్వారా అతడు శాండల్ వుడ్ కు పరిచయం కాబోతున్నాడు. కాగా ఊపిరి, బ్రహ్మోత్సవం తదితర చిత్రాలను నిర్మించి భారీ నిర్మాణ సంస్థగా పేరు పొందిన పీవీపీ నిర్మాణ సంస్థ ద్వారా నిఖిల్ కుమార్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.కొరటాల శివ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు దర్శకుడు కానీ, పీవీపీ నిర్మాణ సంస్థగానీ, హీరో నిఖిల్ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కాగా గతంలో దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా నిఖిల్ హీరోగా ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









