ఐటీ సెక్యూరిటీపై 'త్వాతక్' క్యాంపెయిన్
- June 13, 2016
మస్కట్‌కి చెందిన వాలంటీర్ గ్రూప్ సదా, 'త్వాతక్' పేరుతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన భద్రతపై అవగాహనా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ టీమ్‌లో మొత్తం 30 మంది సభ్యులుంటారు. ఈ టీమ్‌కి 12,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు సోషల్ మీడియాకి చెందిన వివిద ప్లాట్‌ఫామ్స్ మీద. టీమ్ హెడ్ ఇంగ్ కైస్ బిన్ సలిమ్ బిన్ మొహమ్మద్ మక్రాషి మాట్లాడుతూ, ఐటి రంగంలో రిస్క్‌లు, పొటెన్షియల్ థ్రెట్స్ గురించి అవగాహన కల్పించడం, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీపై అందుబాటులో ఉన్న చట్టాల గురించి తెలియజేయడం వంటివి ఈ ప్రచారంలో ముఖ్యాంశాలని ఆయన అన్నారు. ఐటీ వినియోగదారులు, తమ డివైజ్‌ల సెక్యూరిటీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని, వాటి గురించి ఈ ప్రచారంలో అవగాహన కల్పిస్తామని అన్నారు. సైబర్ క్రైమ్స్‌ని తగ్గించడానికి ఈ ప్రచారం ఉపయోగపడ్తుందని ఆయన అన్నారు. 18 నుంచి 25 ఏళ్ళ మధ్యనున్న విద్యార్థుల్లో ప్రధానంగా అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రమదాన్ సందర్భంగా, 'విల్ దే పొండర్' కాన్సెప్ట్‌తో ఖురాన్ రెసిటేషన్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నామనీ, ఎవరైనాసరే తమ రెసిటేషన్‌ని వీడియోలో రికార్డ్ చేసి, దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తే, జడ్జిల ప్యానెల్ అందులోంచి విజేతల్ని ఎంపిక చేసి, బహుమతులు అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి సో మరియు గురువారాల్లో ఈ కాంటెస్ట్ విజేతల ప్రకటన ఉంటుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







